గాంధీ సరోవర్కు రక్షణ శాఖ అనుమతి
హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రతిష్ఠాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు (Gandhi Sarovar Project) పనులకు అనుమతి ఇచ్చినందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh) ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (A. Revanth Reddy) కృతజ్ఞతలు తెలిపారు. మూసీ నది సమగ్ర పునరుజ్జీవనంతో పాటు నది తీరాన్ని పర్యావరణ, సాంస్కృతిక, ప్రజోపయోగ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజన్‌లో ఈ అనుమతి కీలక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం (Central Government) అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.








