ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి : కవిత
బాయి బాట కార్యక్రమం చేపడితే రాజకీయంగా తమను అడ్డుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) పోలీసులను ఏర్పాటు చేశారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత (Kavitha) ఆరోపించారు. ఎంత అడ్డుకుంటే అంత బలంగా ముందుకు సాగుతామన్నారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా (Peddapalli District) రామగిరి మండలం అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టును కవిత సందర్శించారు. కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో ఉద్యోగులకు సౌకర్యాలు, సరైన యంత్రాలు, పనిముట్లు ఏర్పాటు చేయాలని కోరారు. సింగరేణి కార్మికులకు (Singareni workers’ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్ని వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








