సంధ్య థియేటర్ ఘటన .. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హీరో అల్లు అర్జున్ (Allu Arjun)కు నాంపల్లి కోర్టు(Nampally Court) సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని అల్లు అర్జున్ను ఆదేశించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఆ11 నిందితుడిగా చేర్చారు. థియేటర్ యజమాన్యాన్ని ఆ1 నుంచి ఆ10 వరకు నిందితులుగా చేర్చారు. 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు చార్జ్‌షీట్ వేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఇప్పటి వరకు 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. నిందితుల వ్యక్తిగత హాజరు తర్వాత కేసు విచారణ ప్రారంభం కానుంది.
2024 డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి (Revathi) అనే మహిళ మృతి చెందగా, అమె కుమారుడు శ్రీతేజ (Sriteja) తీవ్రంగా గాయపడ్డారు.








