జీ తెలుగు అందిస్తున్న సరికొత్త ధారావాహిక ‘రుణానుబంధం’ జూన్ 22న ప్రారంభం..
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు!
హైదరాబాద్, 19జూన్ 2026:ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్‌లతో సాగే సీరియళ్లను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునే కథ, కథనంతో తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచేందుకు జీ తెలుగు అందిస్తున్న సరికొత్త ధారావాహిక ‘రుణానుబంధం’.భావోద్వేగపూరిత కథనం, ఉత్కంఠభరితమైన మలుపులతో సాగే కుటుంబ నేపథ్య సరికొత్త ధారావాహిక‘రుణానుబంధం’ జూన్ 22న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు, మీ జీ తెలుగులో!
ఈ సీరియల్ కథ ఒక ధనవంతురాలైన, ప్రతిభావంతమైన మహిళ మైనావతి(నీలిమ) ఒక వర్షపు రాత్రి తనకు పుట్టిన బిడ్డను వదిలేస్తుంది. ఆ బిడ్డ ధరణి(అనగ) పేరుతో తోలుబొమ్మలాట కళాకారుడు అప్పన్న(ప్రభాకర్) దగ్గర పెరుగుతుంది. తోలుబొమ్మలాట ద్వారా సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యవంతురాలైన ధరణి ఒకరోజు తన గతాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
ధరణిపై పగతీర్చుకునేందుకు మైనావతి కూతుళ్లు సంజన(నేహాల్), నయన (దివ్య) అనేక కుట్రలు పన్నుతారు. అందులో భాగంగా గ్రామాధినేత, మైనావతి సోదరుడు ధర్మతేజ(సతీష్)తో బలవంతంగా ధరణి వివాహం జరిపించి ఆమెను ఇంట్లోనే బంధిస్తారు. ఆ ఇంట్లో ధరణి ఎదుర్కొనే బాధలు, కుట్రలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. ధరణి జన్మరహస్యం ఎలా బయటపడుతుంది? ధరణి తన కూతురేనని మైనావతి గుర్తిస్తుందా? ద్వేషాన్ని క్షమాగుణం జయిస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే జీ తెలుగు వేదికగా సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమయ్యే ‘రుణానుబంధం’ సీరియల్‌ను మీరూ తప్పకుండా చూసేయండి!
ద్రోహం, ప్రతీకారం, ద్వేషం, క్షమాగుణం.. మధ్య సాగే ఆసక్తికరమైన ధారావాహిక రుణానుబంధం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు మీ జీ తెలుగులో!








