అరణ్యరామం భవనానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం అటవీ శాఖ ప్రాంతంలో అరణ్యరామం అనే పేరిట నిర్మించనున్న భవనానికి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శంకుస్థాపన చేశారు. సుమారు రూ.27 కోట్లతో నిర్మించనున్న ఈ భనవంలో మావన, వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Center), స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. వీటికోసం రెండు హెక్టార్లలో భవనం నిర్మించనున్నారు. భూమి పూజ అనంతరం పవన్ కల్యాణ్ అటవీ ప్రాంతంలో మొక్కను నాటారు. మంత్రులు నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar), కందుల దుర్గేష్ ( Kandula Durgesh), అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీ కాంతిలాల్, దండి అటవీ దళపతి చలపతిరావు పాల్గొన్నారు.








