ఏపీ మద్యం కుంభకోణం కేసు .. మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao) కుమారుడు సునీల్ (Sunil)ను ఈడీ (ED) అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌లో ఆయన్ను అధికారులు అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం సునీల్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కారుమూరి నివాసంలో ఇటీవల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించి వివిధ పత్రాలను పరిశీలించారు. ఇదే కేసులో కీలక సూత్రధారి రాజ్ కెసిరెడ్డి (Raj KC Reddy), ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి (Vasudeva Redd)ని ఈడీ ఈరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కారుమూరి సునీల్‌ను అధికారులు అరెస్ట్ చేశారు.








