మాజీ మంత్రి కారుమూరి, ఆయన కుమారుడికి సిట్ నోటీసులు
జగన్ (Jagan) హయాంలో లిక్కర్ (Liquor) రవాణా కాంట్రాక్టు, టెండర్లలో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao)కు, ఆయన కుమారుడు సునీల్ (Sunil) కు సిట్ అధికారులు నోటీసులు జారీచేశారు. విజయవాడ కమిషనర్ కార్యాలయంలోని సిట్ ఆఫీసుకు గురువారం(23న) హాజరు కావాలని ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని నివాసంలో వారు లేకపోవడంతో అధికారులు ఆ ఇంటి గోడకు నోటీసులు (Notices) అంటించారు. వైసీపీ హయాంలో మద్యం రవాణాకు సంబంధించి అవకతవకతలు జరిగినట్లు సిట్ కేసు నమోదుచేసింది. కారుమూరి, ఆయన కుమారుడికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. గోడకు నోటీసులు అంటించిన కాసేపటికే వాటిని ఎవరో చించివేశారు. వైసీపీ హయాంలో మద్యం రవాణాచేసే కాంట్రాక్టులో రూ.200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంలో సీఐడీ గత నెలలో కేసు నమోదుచేసింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








