బ్లాక్ బ్యూటీగా మంత్రముగ్ధులను చేస్తున్న మోనాల్
సుడిగాడు(Sudigadu) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాతీ భామ మోనాల్ గజ్జర్(monal gajjar) తర్వాత బిగ్‌బాస్4(bigg boss4) తో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. చీరకట్టు, మోడరన్ డ్రెస్సుల్లోనూ తన గ్లామర్‌తో సోషల్ మీడియాను షేక్ చేసే మోనాల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బ్లాక్ మోడరన్ అవుట్‌ఫిట్ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో మోనాల్ స్టైలిష్ అండ్ మోడరన్ బ్లాక్ కో ఆర్డ్ సెట్లో మెరిసిపోయింది.

డీప్ వీ నెక్లైన్, నడుము భాగంలో కటౌట్ డిజైన్, కింద ఫ్లేర్డ్ రఫుల్డ్ పెప్లమ్ హెమ్తో ఉన్న స్లీవ్‌లెస్ టాప్ ఆమెకు పర్ఫెక్ట్ లుక్ ఇచ్చింది. ఈ స్టైలిష్ అవుట్‌ఫిట్‌కు తగ్గట్టుగా మోనాల్ సింపుల్, మినిమల్ యాక్సెసరీస్‌తో చేతికి ఒక మెటాలిక్ వాచ్, స్టైలిష్ బ్రాస్లెట్ మరియు వేలికి ఒక పెద్ద కాక్టెయిల్ రింగ్ పెట్టుకుని తన లుక్కు మరింత రాయల్ టచ్ ఇచ్చింది. ఈ మోడరన్ దుస్తుల్లో మోనాల్ గ్లామర్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ ఫ్యాన్స్ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.









