కోల్ కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కోల్‌కతా (Kolkata)లోని కాళీ మాత ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు లోకేష్‌కు స్వాగతం పలికారు. కాళీమాతను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. శక్తి స్వరూపిణి కోల్‌కతా కాళీ మాతను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అన్నిరంగాల్లో అగ్రగామిగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఆనందమయ జీవితం ప్రసాదించాలని కాళీమాతను వేడుకున్నానన్నారు.








