19th June 2026

__________

- Saidulu

స్ట్రీట్ స్టైల్ రుచిని తలపించే ఆలూ టిక్కీ చాట్ సీక్రెట్ రెసిపీ చేసేద్దామా..!

సాయంత్రం చల్లని గాలిలో, కరకరలాడే వేడి ఆలూ టిక్కీ చాట్ తింటుంటే వచ్చే మజానే వేరు! అందరికీ నచ్చే స్ట్రీట్ స్టైల్ రుచి ఇది.

ముందుగా ఉడికించిన బంగాళాదుంపలు, బైండింగ్ కోసం కొద్దిగా కార్న్‌ఫ్లోర్ లేదా బియ్యప్పిండి, మరియు చాట్ మసాలాలను సిద్ధం చేసుకోండి.

కావలసినవి

ఆలూని మ్యాష్ చేయకుండా తురిమితే టిక్కీలు విరిగిపోవు. కొద్దిగా బియ్యప్పిండి కలిపితే టిక్కీ సూపర్ క్రిస్పీగా వస్తుంది.

అసలైన సీక్రెట్

ఆలూ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా తీసుకుని, చేతులకు నూనె రాసుకుని గుండ్రటి కట్లెట్స్ లేదా టిక్కీల్లా ఒత్తుకోవాలి.

టిక్కీ రూపం 

మధ్యస్థ మంటపై తవా మీద కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, టిక్కీలను రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

 పెనంపై ఫ్రై 

కారం కోసం పుదీనా-కొత్తిమీర గ్రీన్ చట్నీ, తియ్యదనం కోసం చింతపండు-బెల్లం చట్నీలను ముందే తయారు చేసి పక్కన పెట్టుకోండి.

చట్నీల మ్యాజిక్ 

ప్లేటులో వేడి టిక్కీలను ఉంచి, లైట్‌గా ప్రెస్ చేయాలి. దానిపై బాగా చిలికిన చల్లని క్రీమీ పెరుగును ధారగా పోయాలి.

చాట్ అలంకరణ

ఇప్పుడు గ్రీన్ చట్నీ, తీపి చట్నీ వేసి.. పైన ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, కారం, వేయించిన జీలకర్ర పొడి చల్లండి.

రుచుల సమ్మేళనం

చివరగా సన్నటి కారప్పూస , దానిమ్మ గింజలతో గార్నిష్ చేస్తే నోరూరించే క్రిస్పీ ఆలూ టిక్కీ చాట్ రెడీ! ఎంజాయ్!