Ashika Ranganath: రాజసంతో వెలిగిపోతున్న ఆషికా
అమిగోస్(Amigos) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆషికా రంగనాథ్(Ashika Ranganath), తర్వాత నాగార్జున(nagarjuna)తో కలిసి నా సామిరంగ అనే సినిమాలో నటించి మెప్పించింది.

ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్న ఆషికా, చిరంజీవి(chiranjeevi) హీరోగా వస్తున్న విశ్వంభర(Vishwambhara) మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది.

ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆషికా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది.

అందులో భాగంగానే అమ్మడు తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేయగా, అందులో డిజైనర్ లెహంగా ధరించి అటు ట్రెడిషనల్, ఇటు మోడ్రన్ లుక్ ను మిక్స్ చేస్తూ, దానికి తగ్గ జ్యుయలరీ ధరించి మరింత అందంగా మెరవగా, ఆ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.









