జుట్టు పలుచబడటం, రాలిపోవడం వేధిస్తున్నాయా? గోధుమ మొలకల సలాడ్ పోషకాలతో జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
గోధుమ మొలకల్లో విటమిన్ E, జింక్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతాయి.
ఈ సలాడ్ కోసం గోధుమ మొలకలు, క్యారెట్, దోసకాయ, టమాటా, ఉల్లిపాయ సిద్ధం చేసుకోండి.
గోధుమలను రాత్రంతా నానబెట్టి మొలకలు వచ్చే వరకు ఉంచితే పోషక విలువలు మరింత పెరుగుతాయి.
మొలకలు వచ్చిన గోధుమలను శుభ్రంగా కడిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి.
తరిగిన క్యారెట్, దోసకాయ, టమాటా, ఉల్లిపాయ ముక్కలను గోధుమ మొలకల్లో కలపండి.
కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి జోడిస్తే సలాడ్ రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.
ఈ సలాడ్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు కణాలను రక్షించడంలో సహాయపడతాయి.
వారానికి 3–4 సార్లు ఈ సలాడ్ తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సరైన సంరక్షణ ఉంటే జుట్టు బలంగా, ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది.