వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా ఉండాలంటే కాల్షియం అధికంగా ఉన్న రాగి రొట్టెలను ఆహారంలో చేర్చండి.
1 కప్పు రాగి పిండి, ¼ కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, గోరువెచ్చని నీరు.
రాగి పిండిలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలపండి.
ఇప్పుడు గోరువెచ్చని నీటిని కొద్దికొద్దిగా పోస్తూ మెత్తగా పిండిలా కలుపుకోవాలి.
పిండిని చిన్న ఉండలుగా చేసుకుని ప్లాస్టిక్ షీట్ లేదా అరటి ఆకుపై రొట్టెలా ఒత్తుకోవాలి.
స్టవ్‌పై పెనం వేడి చేసి ఒత్తిన రాగి రొట్టెను జాగ్రత్తగా వేసి కాల్చాలి.
ఒక వైపు కాలిన తర్వాత మరో వైపు తిప్పి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి.
కావాలంటే పైపైగా కొద్దిగా నెయ్యి రాసి మరింత రుచిగా తయారుచేసుకోవచ్చు.
రాగి రొట్టెలను పెరుగు, పచ్చడి లేదా కూరతో తింటే రుచి, పోషకాలు రెండూ పెరుగుతాయి.
కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉండే రాగి రొట్టెలు ఎముకల ఆరోగ్యానికి మంచి ఆహారంగా నిలుస్తాయి.