చిరంజీవితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భేటీ
అగ్ర కథనాయకుడు చిరంజీవి (Chiranjeevi) తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandra Rao) భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బీజేపీ చేపట్టిన విశేష్ జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా చిరును బీజేపీ నేతల కలిశారు. ఈ సందర్భంగా మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన కీలక విజయాలు, చేపట్టిన సంక్షేమ పథకాల గురించి చిరంజీవికి ఆయన వివరించారు. ఆ వివరాలు ఉన్న బుక్లెట్ ( booklet)ను అందజేశారు.








