రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు .. రెన్యువల్ సీఎం : కేటీఆర్
హైడ్రా (HYDRAA), మూసీ (Musi) మాటూన రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం కావాలని బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. శంషాబాద్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోయే వారు ఆందోళన చెందవద్దని, రాబోయేది కేసీఆర్ (KCR) ప్రభుత్వమేనని అన్నారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతున్న సర్ ( ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ) సర్వేలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. అర్హులైన వారివి ఒక్క ఓటు కూడా చేజారొద్దు. అక్టోబరు 1న తుది ఓటరు జాబితా విడుదల చేసే వరకు నాయకులు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.








