రవితేజ ‘ఇరుముడి’ నుంచి ఫాదర్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణ జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఫాదర్స్ డే సందర్భంగా ‘ఇరుముడి’ చిత్ర బృందం ఓ బ్యూటీఫుల్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో మాస్ మహారాజా రవితేజ, తన కూతురు నుదుటిపై ప్రేమగా ముద్దుపెడుతూ కనిపించడం ఆకట్టుకుంటోంది. తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలను ఎంతో హృద్యంగా ఆవిష్కరించిన ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎమోషనల్ గా టచ్ చేసింది. ఈ ఫాదర్స్ డే స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది.
ఎనర్జిటిక్ కమర్షియల్ ఎంటర్టైనర్స్తో ప్రేక్షకులను అలరించిన రవితేజ ‘ఇరుముడి’లో పూర్తిగా భిన్నమైన, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయన నటన ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించనుంది. కుటుంబ భావోద్వేగాలు నేపథ్యంలో శివ నిర్వాణ ఈ కథను మనసుని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. అదే సమయంలో కమర్షియల్ అంశాలను కూడా సమతూకంగా మేళవించారు.
ఈ చిత్రంలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, బేబీ నక్షత్ర కీలక పాత్రలు పాత్రల్లో కనిపించనున్నారు.
నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్, ప్రవీణ్ పూడి ఎడిటర్
శివ నిర్వాణ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, నరేష్ బాబు పి స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్, భక్తి, కుటుంబ బంధాలు, భావోద్వేగాలను సమన్వయం చేస్తూ రూపొందుతున్న ‘ఇరుముడి’, రవితేజ కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన చిత్రాల్లో ఒకటిగా నిలవబోతోంది.
వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భంగా ఇరుముడి ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.








