నేతల దెబ్బకి కన్ఫ్యూషన్ లో ప్రజలు..
ఈసారి నెల్లూరు నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నెల్లూరు పై వరాల జల్లు కురిపిస్తున్నారు. వైసీపీకి నెల్లూరుని కంచుకోటగా మలిచిన మేకపాటి, ఆనం, కోటం రెడ్డి పార్టీని వీడి బయటకు వెళ్ళిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో నెల్లూరు తమ చేతుల్లోంచి జారిపోకుండా ఉండడం కోసం వైసీపీ ఎంతో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీటలు వారిన నెల్లూరు కోటను తిరిగి కంచుకోటగా మార్చడానికి ఇక్కడ యువత ను టార్గెట్ చేస్తున్నారు విజయ్ సాయి రెడ్డి. తనను గెలిపిస్తే జిల్లాకు ఐటి కంపెనీలు రప్పించడంతో పాటు యువతకు భారీగా ఉద్యోగాల అవకాశాన్ని కల్పిస్తామని.. విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయిస్తామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా మొత్తం అన్ని సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. ఈసారి కూడా వాళ్ళు ఇక్కడ నుంచి అదే రేంజ్ విక్టరీ ఆశిస్తున్నారు. అయితే పార్టీ పై తిరుగు బావుటా ఎగరవేసి బయటకు వెళ్లిన నేతలు పార్టీ పై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. నిన్నటి వరకు మా పార్టీ గొప్పది అని చెప్పిన వారే ఈరోజు పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం తో దేన్ని నిజమని నమ్మాలో కూడా అర్థం కావడం లేదు. దీంతో ప్రస్తుతం నెల్లూరు ప్రజలు ఎవరికి ఓటు వేయాలి అనే విషయంపై బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు.













