తెలుగు తల్లిపై సూర్య కిరణాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ టవర్ డిజైన్ అందరినీ ఆకర్షించడం ఒక ఎత్తు అయితే, దర్శకుడు రాజమౌళి చేసిన సూచన సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఎత్తైన టవర్ నుంచి అసెంబ్లీ సెంట్రల్ హాలులోకి సూర్యకిరణాలు పడేలా నార్మన్ ఫోస్టర్ డిజైన్ రూపొందించింది. కిరణాలు పడుతున్న దృశ్యం చూడటానికి ఎంతో అందంగా ఉంది. అయితే దర్శకుడు రాజమౌళి తన కళాత్మకతకు పదును పెట్టి వాప్ అనిపించారు. అసెంబ్లీ సెంట్రల్ హాలులో కిరణాలు పడుతున్న ప్రదేశంలో తెలుగుతల్లి రమణీయ విగ్రహం పెట్టాలని సూచించారు. అలా సూర్య కిరణాలు పడుతున్న తెలుగు తల్లి గ్రాఫిక్ వీడియోను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.













