Posani: పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఎదురుదెబ్బ
వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) కొట్టివేసింది. సీఐడీ (CID) దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. పోసానిని ఇప్పటికే పీటీ వారెంట్‌పై కర్నూలు(Kurnool)లో అదపులోకి తీసుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కోర్టుకు తెలిపారు. మంగళగిరి (Mangalagiri) మేజిస్ట్రేట్ ఎదుట పోసానిని ప్రవేశపెట్టేందుకు కర్నూలు నుంచి తీసుకొస్తున్నారని పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం పోసాని లంచ్ మోషన్ పిటిషన్‌ను కొట్టివేసింది.













