అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీ బాలిక మృతి
అమెరికాలోని పోర్టులాండ్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచికి చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందింది. ఇదే ఘటనలో ఆ బాలిక తల్లి కూడా తీవ్రంగా గాయపడడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కొణకంచికి చెందిన కమతం నరేష్, గీతాంజలి దంపతులకు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తూ, గడిచిన పదేళ్లుగా అమెరికాలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. వీరి కుమార్తె హానిక (6) జన్మదినాన్ని పురస్కరించుకొని కుమార్తె, కుమారుడితో కలిసి దంతపులు కారులో గుడికి వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కుమార్తె హానిక అక్కడిక్కడే మృతి చెందారు. గీతాంజలి తలకు బలమైన గాయం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా కోమాలో ఉన్నారని చెబుతున్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న కొణకంచి లోని బంధువుల కుటుంబాల్లో విషాదం అలముకొంది.







