ప్రధాని మోదీ తిరుమల పర్యటన ఖరారు
ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల పర్యటన ఖరారైంది. ఆదివారం (26వ తేదీ) సాయంత్రం తెలంగాణలోని దుండిగల్ విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 6:50 గంటలకు తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి మోదీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రహదారి మార్గంలో తిరుమల చేరుకుని రచన అతిథి గృహంలో బస చేస్తారు. 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8:45 గంటల వరకు శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 10:25 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11:30 గంటలకు తెలంగాణలోని హకీంపేట విమానాశ్రయం చేరుకుంటారు. ఈ మేరకు అధికార యంత్రాంగా ఏర్పాట్లు చేస్తోంది.













