PM MODI :విశాఖలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ (Visakhapatnam )లో పర్యటించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒకే వాహనంపై సిరిపురం నుంచి కూడిలి నుంచి బహిరంగ సభ వేదిక అయినా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల(AU Engineering College) మైదానం వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో అడుగడుగునా పూలు చల్లుతూ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మోదీ, చంద్రబాబు, పవన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోడ్ షో అనంతరం ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరైన మోదీకి రాష్ట్ర ప్రజల తరపున అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్వాగతం పలికారు. వేదికపై ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు సత్కరించి, శేషశయనుడి విగ్రహం, అరకు కాఫీ కిట్‌ను బహూకరించారు.













