ఇలాంటి వాళ్లు వెళ్లినా.. వచ్చే నష్టమేమీ లేదు
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనం రామనారాయణ రెడ్డి ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అంటూ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు కుట్రలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. టీడీపీలోకి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు కాని ఇలాంటి ఆరోపణలు సమంజసం కాదంటూ మంత్రి హితవు పలికారు. సీఎం జగన్ పార్టీ పెట్టకపోతే ఎమ్మెల్యేలు అయ్యేవారా? ఇలాంటి వారికి సీఎం జగన్ భయపడేవారు కాదు. టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే. ఇలాంటి వాళ్లు వెళ్లినా వచ్చే నష్టమేమీ లేదని అన్నారు.













