డిసెంబర్ 14న పవన్ కల్యాణ్ అమెరికా పర్యటన
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ డిసెంబరు 14న అమెరికాలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్న పవన్ కల్యాణ్ అమెరికాలో కూడా మూడు రోజలుపాటు పర్యటించి అక్కడ ప్రవాస భారతీయులతో భేటీ కావాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వరుస భేటీలు, యాత్రలు, పోరాటాలతో బిజీగా ఉన్న జనసేనాని అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాధానత్య నిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా పర్యటన చేపడుతున్నారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలోనూ ఒకసారి అమెరికాలో పర్యటించిన పవన్ కల్యాణ్ అక్కడి ఎన్ఆర్ఐలతో భేటీ అయ్యారు. ఇప్పుడు మరోసారి వారితో భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం డాల్లాస్ వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.













