పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు.. సచివాలయ వ్యవస్థ దేనికి?
పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు, సచివాలయ వ్యవస్థ దేనికి? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తాడేపల్లిగూడెంలో జనసేన నాయకులు, వీర మహిళలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్భుతాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదని, పేదల బతుకులు మార్చాలనే వచ్చానని తెలిపారు. రాజకీయాల్లో ప్రలోభాలను దాటుకొని ముందుకు వెళ్తున్నాం. రాజకీయాల్లో ఎదురుదాడి అలవాటు చేసుకోవాలి. మనం ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదు. అద్భుతాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. పేదల బతుకులు మార్చాలని వచ్చా. నేను, నా కుటుంబం ఎందుకు విమర్శలు ఎదుర్కోవాలి? సమాజంపై ప్రమేతో నా ప్రాణం, కుటుంబాన్ని పణంగా పెట్టి వచ్చా. రాష్ట్రంలో అవినీతి నిత్యకృత్యమైపోయింది. నా అభిమానా సరే, మాన, ప్రాణాలకు భంగం కలిగిస్తే శిక్షించాలి అని అన్నారు.













