పరిటాల ఆశయాలు నెరవేరుస్తాం
పరిటాల రవి మరణించి ఎంత కాలమైనా ప్రజల గుండెల్లో ఆయన చేసిన పోరాటాలు నిలిచే ఉంటాయని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో రవి జయంతిని నిర్వహించారు. రవి ఘాట్ వద్ద కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి దేవినేనితోపాటు పులువురు ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు నివాళులర్పించి రవితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సునీత మాట్లాడుతూ రవి 60వ ఏట షష్ఠిపూర్తి చేసుకోవాల్సిన సందర్భంలో నివాళులర్పించడం బాధగా ఉందన్నారు. రవి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. మంత్రి దేవినేని మాట్లాడుతూ ప్రజల కోసం పోరాటాలు చేసిన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ హయాంలో హత్య చేశారని, ఆ సంస్కృతిని ఇప్పటికైనా విడనాడాలన్నారు.













