16న ఏపీ బంద్
ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్‌కు వామపక్ష పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 16వ తేదీన బంద్‌కు పిలుపునిస్తున్నామని, అయితే అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపునిస్తున్నామన్నారు. అలాగే బంద్‌లు చేయాలని మాకు కోరిక కాదు, ప్రజల కోసం రోడ్డెక్కుతున్నాం అని అన్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బంద్‌కు పిలుపునిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీక్ష ఉందన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.













