తెలుగు రాష్ట్రాల సమస్యలపై.. కేంద్ర కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం దృష్టి సారించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీలో కేంద్రం తరపున హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అశిష్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. తెలంగాణ నుంచి రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్.ఎస్.రావత్ సమావేశంలో పాల్గొననున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ప్రతి నెల ప్రతి సభ్య కమిటీ సమావేశం అవుతుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలి సమావేశం జరుగనుంది.
విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని ఆస్తుల పంపకాలపైనా భేఓటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాలూ చర్చకు రానున్నాయి. సమావేశంలో ఏ అంశాలు చర్చించాలన్న దానిపై కేంద్ర హోంశాఖ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది. ఈ నెల 8న జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.