ఏపీ ఆక్టోపస్ మరో ఘనత … దేశంలోనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది. జాతీయ భద్రతా దళ విభాగం (ఎన్ఎస్జీ) అగ్నీ పరీక్ష-7 పేరుతో హరియాణాలో ఈ పోటీలు నిర్వహించింది. ఇందులో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు, వివిధ ఆలయుధాలతో ఫైరింగ్, మారథాన్ రన్నింగ, శారీరక ధారుఢ్య పోటీలు నిర్వహించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ అక్టోపస్ బృందం మొదటి స్థానం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఎన్‌ఎస్‌జీతోపాటు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన బృందాలు పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ అక్టోపస్ విభాగం మొదటి స్థానం సాధించడమే కాకుండా ఉత్తమ జుట్టుగా కూడా నిలిచింది. రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎ.పాపారావు ఉత్తమ ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యారు.













