అమరావతినే రాజధానిగా కొనసాగించాలి
వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు కోసం ఆడుతున్న ఆటలో అమరావతి రైతులు పావుగా మారారని పలువురు ప్రవాసాంధ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాని కోరుతూ అమెరికాలోని లాస్ ఏంజిలెస్‌లో భారత కాన్సులేట్ జనరల్‌కు విజ్ఞాపన పత్రాన్ని అందించినట్లు ప్రవాసాంధ్రులు శ్రీహరి అట్లూరి, సురేశ్ కందేపు, విష్ణు యలమంచి, శ్రీనివాస్ కొల్లి ఓ ప్రకటనలో తెలిపారు. ఒకే రాష్ట్రానికి మూడు రాజధానులనే విధానం దేశంలో ఎక్కడా లేదు. జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక వ్వవస్థ దెబ్బతింటోంది. పెట్టుబడిదారులు తరలిపోతున్నారు అని పేర్కొన్నారు.













