సామాన్య భక్తులకు పెద్దపీట : పుట్టా
తిరుమలలో శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. శ్రీవారి ఆలయంలో చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందని అందుకు తగిన విధంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పాలకమండలి సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.













