నారా లోకేశ్ యువగళం యాత్ర ప్రారంభం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరిగ్గా 11:03 గంటలకు ఆయలం వద్ద నుంచి తొలి అడుగు వేసి పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కాలి నడకన తిరిగి క్షేత్ర స్థాయి పరిస్థితులను కళ్లారా లోకేశ్ చూడనున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణతో పాటు పలువురు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సినీనటుడు తారకరత్న తదితరులు పాదయాత్రలో యువనేత వెంట నడిచారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రను కొనసాగనుంది. కుప్పంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.













