కాబోయే ప్రధానిని నిర్ణయించేది బాబే
వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని కేంద్రంలో ప్రధాని అభ్యర్థిని నిర్ణయించేది టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ సృష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఆయన మండల పరిధిలోని రాళ్లబూదుగూరులో స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను మోదీ మోసంగించారన్నారు. మొదటి సంవత్సరం ప్రత్యేక హోదా ఇస్తామని, రెండో సంవత్సరం ప్యాకేజీ ఇస్తామని అన్నారు. మూడో సంవత్సరం ఒకరికి ఇస్తే మరొకరికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వస్తుందని సాకుతో గడిపి మొండి చేయి చూపారని విమర్శించారు.













