సౌత్ లోనే మన రాష్ట్రం నెంబవర్ వన్… లోకేష్

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో ధరలు రెండింతలు పెరిగాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెంపులో సౌత్‍లో మన రాష్ట్రాన్ని నెంబర్‍వన్‍గా నిలిపారని అన్నారు. ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపం, ప్రజలకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. ఆంధప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉందన్నారు. జగన్ పాలన విధ్వంసం, విద్వేషం రెండు కళ్లుగా సాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ట్యాక్స్లకు అదనంగా జగన్ ట్యాక్స్ తోడవడంతో అన్ని రేట్లూ పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కేసుల్లో ఐదోస్థానానికి చేర్చిన ఘనత వైఎస్ జగన్‍దేనని అన్నారు.