Nara Lokesh : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నా శుభాభినందనలు
కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కి కుంకీ ఏనుగులు రప్పించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అభినందనలు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా (Chittoor District) లో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల (Elephants)ను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. అన్నదాతల ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవ చూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక (Karnataka) ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అని లోకేశ్ పేర్కొన్నారు.













