ముగిసిన నారా లోకేశ్ సీఐడీ విచారణ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు లోకేశ్‌ని ప్రశ్నించారు. విచారణ అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. గత నెల 30న 41ఏ కింద సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలన్నారు. ఆ మేరకు ఇవాళ విచారణకు హాజరయ్యా. అయితే, ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని అనేక ప్రశ్నలు అడిగారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదు. సీఐడీ అధికారులు నన్ను 49 ప్రశ్నలు అడిగారు. నేను, నా కుటుంబసభ్యులు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఎలా లాభపడ్డారో ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. బుధవారం మరోసారి విచారణకు రావాలన్నారు. హాజరవుతా. ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడాలి అని అన్నారు.













