మూడేళ్లు పోరాడి మండలి తెస్తే.. 3 నిమిషాల్లో రద్దు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కక్ష ఎలా ఉంటుందో శాసనమండలి రద్దుతో కనబడుతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూడేళ్లు పోరాడి మండలి తెస్తే, జగన్ 3 నిమిషాల్లో రద్దు చేస్తున్నారన్నారు. మండలి రద్దుతో వైసీపీకే ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. పుస్తకాల్లో చదివిన నియంతలను జగన్ రూపంలో చూస్తున్నామన్నారు. కన్న తండ్రిని వేధించిన జగన్‌కు ప్రజలు ఒక లెక్కా అని వ్యాఖ్యానించారు. జగన్‌రెడ్డిని గెలిపించిన వాళ్లు కక్కలేక మింగలేక చస్తున్నారన్నారు. సీఎం పోలీసు వ్యవస్థను నాశనం చేశారని, పోలీసులను ఎలా వాడాలో జగన్ చూపించారని ఆనందబాబు వ్యాఖ్యానించారు.











































































