అమరావతి కోసం ఆంధ్రుల పోరాటం : చంద్రబాబు
నమ్మక ద్రోహాన్ని ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర మంతా ఒక్కటిగా నిలిచి అమరావతి కోసం పోరాడదామని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న ఉద్యమం 300 రోజుకు చేరిందని గుర్తు చేస్తూ.. 92 మంది రైతులు, రైతు కూలీలు మహిళలు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. అమరావతి అనేది 5 కోట్ల మంది ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్‌కు ఆయుపు పట్టు అని చంద్రబాబు ఉద్ఘాటించారు.













