కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి… రఘురామ
అమరావతి రైతుల పాదయాత్రకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. యాత్రకు ఆటంకం కల్పించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాదయాత్ర భగ్నం చేసేందుకు కుట్రపన్నుతున్నారని అన్నారు. మంత్రులు, వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. పాదయాత్ర శాంతియుతంగా జరుగుతున్నా ఏదో ఒక విధంగా భగ్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. పాదయాత్రలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. మంత్రులు, వైసీపీ నేతల వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాలను కూడా అమిత్‌షాకు పంపారు.













