భీమవరానికి వెళ్తున్న నన్ను.. ఆంధ్రా సరిహద్దులో
భీమవరానికి వెళ్తున్న తనను ఆంధ్రా సరిహద్దులో హత్య చేసేందుకు కుట్ర చేశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా స్థానిక ఎంపీగా అధ్యక్షత స్థానంలో ఉండాల్సిన తనను భీమవరం రాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కుట్ర చేశారని వ్యాఖ్యనించారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి వెళ్లిన సమాచారం తన వద్ద ఉందని పేర్కొన్నారు. తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు వ్యవహారంపై కోర్టు వెళ్తాననని స్పష్టం చేశారు. సత్తెనపల్లి వద్ద బోగిని తగులబెట్టి తనను హత మార్చాలని చూశారని రఘురామ తీవ్ర ఆరోపించారు.













