MLC Election :ఈ నెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్…
ఉత్తరాంధ్ర ఉపాధ్యయ ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Election )కు 10వ తేదీ వరకు 20 నామినేషన్లు వచ్చాయని అందులో పది మంది మాత్రమే అర్హత సాధించారని విశాఖ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికార ఎం.ఎన్. హరింద్ర ప్రసాద్ (M.N. Harindra Prasad) తెలిపారు. ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో మొత్తం పది మంది బరిలో ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తాం. మొత్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 13,580 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు ముందు ఓటర్లు స్లిప్‌లు అందిస్తున్నాం. మార్చి 3న ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ (AU Engineering College)లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 11 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశాం. ప్రతి మండలంలో ఒక టీమ్ ఉంటుందని అని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని విశాఖ డీసీపీ అజితా వేజిండ్ల (Ajitha Vejindla) తెలిపారు. ఎన్నికల నియామావళి ప్రకారం పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.













