నా రాజీనామా ఆమోదించండి : కల్యాణ చక్రవర్తి
శాసనమండలి చైర్మన్ తన హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తుండటం దారుణమని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి విమర్శించారు. మండలి సభ్యత్వానికి తాను రాజీనామా చేసి దాదాపు రెండు నెలలు దాటిందని, తాను వ్యక్తిగతంగా హాజరై చైర్మన్కు రాజీనామా పత్రం అందజేసినట్లు తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు చైర్మన్ని కలిశారని, గురువారం మరోసారి రాజీనామాను ఆమోదించమని కోరినట్లు పేర్కొన్నారు. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంకా రాజీనామా ఆమోదించకపోవడం తన హక్కులను కాలరాయడమేనని కల్యాణ్ చక్రవర్తి అసహనం వ్యక్తం చేశారు.













