Nimmala Ramanaidu : భద్రత కావాల్సింది జగన్కు కాదు.. ప్రజలకు : మంత్రి నిమ్మల
పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య (Singayya) మృతి మాజీ సీఎం జగన్ (Former CM Jagan) లో ఉన్న క్రూరత్వానికి నిదర్శమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పరామర్శ పేరుతో జగన్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. తన సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలంటేనే జగన్కు లెక్కలేకుండా పోయిందని తెలిపారు. జగన్ వైఖరి దారుణంగా ఉంది. నరుకుతాం అనే మాటలను సమర్థించడంలోనే జగన్ వైఖరేంటో తెలుస్తోంది. పార్టీ కార్యకర్తల ప్రాణాలూ ఆయనకు లెక్కలేదు. చనిపోయిన ఏడాది తర్వాత వెళ్లి పరమర్శిచండం మరీ విడ్డూరం. కారు (Car) కింద మనిషి పడినా పట్టించుకోకుండా వెళ్లడం దారుణం. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రి (Hospital) కి తరలించకుండా వెళ్లడం ఆయనకే చెల్లింది. భద్రత కావాల్సింది జగన్కు కాదు, ఆయన్నుంచి ప్రజలకు భద్రత కావాలి అన్నారు.













