ఇద్దరు మంత్రులకు లైన్ క్లియర్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో ఇద్దరు మంత్రులకు వారు పోటీ చేసే నియోజకవర్గాలు అనధికారికంగా ఖరారయ్యాయి. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడానికి పార్టీ నాయకత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఆయనకు ఇప్పటివరకూ నియోజకవర్గం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈసారి ఆయన్ను నెల్లూరు సిటీ నుంచి బరిలోకి దింపాలని నాయకత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇక సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కాల్వ శ్రీనివాసులు తన సొంత నియోజకవర్గం రాయదుర్గం నుంచే మళ్లీ పోటీ చేస్తారని ఖారరైంది.













