గల్లా జయదేవ్ కు ఆంధ్రప్రదేశ్ క్షమాపణలు చెపుతోంది: మంత్రి నారా లోకేశ్
గల్లా జయదేవ్ (Galla Jayadev) గత ప్రభుత్వ హయాంలో మీ సంస్థ అమర రాజా గ్రూప్ (Amara Raja Group) ఎదుర్కొన్న వేధింపులకు ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణలు చెపుతోంది అని మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh) అన్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar district) దివిటిపల్లి గిగా కారిడార్లో అమరరాజా కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో మీ కంపెనీ ఎదుర్కొన్న వేధింపులు జరిగి ఉండాల్సింది కాదు. ఆంధ్రప్రదేశ్ లో అంకురించిన ఒక సంస్థ తన తదుపరి వృద్ధి కోసం మన సరిహద్దులు దాటి బయట వెతుక్కోవాల్సి రావడం నన్ను ఎంతగానో కలచివేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మరోసారి మీ పరిశ్రమలకు, పెట్టుబడులకు సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో అమరరాజా సాధించే అతిపెద్ద విజయాలన్నీ ఆ సంస్థ సొంత గడ్డపైనే సాగుతాయని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.








