తిత్లీ తుఫాను సహాయక చర్యలపై మంత్రి లోకేష్ సమీక్ష
శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం స ష్టించిన తిత్లీ తుఫాను సహాయక చర్యలపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. మందస కంట్రోల్ రూం నుంచి సహాయక కార్యక్రమాలపై ఆరా తీశారు. ఇళ్లు, పంట నష్టంపై త్వరలోనే నివేదిక చేస్తామన్నారు. కూలిన విరిగిన చెట్లను తొలగించే పనులకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ జరుగుతున్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేయాలని లోకేష్ సూచించారు. విద్యుత్ పునరుద్ధరణకు 900 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, 40 క్రేన్లను వినియోగిస్తున్నామని చెప్పారు.













