Nara Lokesh: రుస్తోంజీ గ్రూప్ ఛైర్మన్ బొమన్ ఇరానీతో మంత్రి లోకేష్ భేటీ

విశాఖలో లగ్జరీ టౌన్ షిప్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయండి
ముంబయి: రుస్తోంజీ గ్రూప్ (Rustomjee Group) ఛైర్మన్ బొమన్ ఇరానీతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో భేటీ అయ్యారు. రుస్తోంజీ గ్రూప్ దేశవ్యాప్తంగా 25 మిలియన్ చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంగల లగ్జరీ ఫ్లాట్లను అభివృద్ధి చేసింది. మరో 43 మిలియన్ చదరపు అడుగులకు పైగా ప్రాజెక్టులు పైప్ లైన్ లో ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌ల నిర్మాణంలో రుస్తోంజీ సంస్థ దేశంలో పేరెన్నికగన్న సంస్థ. బొమన్ ఇరానీతో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ల రాకతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహానగరంలో లగ్జరీ టౌన్ షిప్ నిర్మాణం చేపట్టాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.