Janardhan Reddy: వారికి శిక్ష తప్పదు : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన ఏ ఒక్కరికీ శిక్ష తప్పదని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవానాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (Janardhan Reddy) అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే బండారు సత్యనందరావు (Bandaru Satyananda Rao) తో కలిసి ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పాలకులు మద్యంలో రూ.4 వేల కోట్లు అవినీతి చేసి జైలుపాలయ్యారని ఎద్దేవా చేశారు. వైసీపీ (YCP) హయాంలో టీడీపీ(TDP) నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులపై విచారణ జరిపించి న్యాయం చేస్తామన్నారు.







