విశాఖలో ఘంటసాల శతజయంతి ఉత్సవాలు
గాన గాంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను డిసెంబర్ 4న విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశించారు. సాంస్వృతిక, పర్యాటక, క్రీడా శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లా కేంద్రాల్లోనూ వేడుకలు నిర్వహించాలని పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్భార్గవ్కు సూచించారు. పాటల పోటీలను నిర్వహించి ఉత్తమ గాయకులకు బహుమతులు అందించాలని, ఘంటసాల జీవిత చరిత్రను గ్రంథస్తం చేసి పుస్తకాలు ఆవిష్కరించాలన్నారు. లేపాక్షి, కొండపల్లి, పెడన, శ్రీకాళహస్తి, వెంకటగిరి ప్రాంతాలను ప్రపంచ హెరిటేజ్ ప్రాంతాలుగా ప్రపంచ హెరిటేజ్ ప్రాంతాలుగా గుర్తించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని మంత్రి ఆదేశించారు.













