మంగళగిరి పై నారా లోకేష్ ఫుల్ ఫోకస్..
నారా లోకేష్ ఈసారి ఎన్నికల్లో టిడిపి ప్రచారానికి కీలక పాత్ర పోషిస్తారు అని అందరూ భావించారు. లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర, శంఖారావం సభలు అతనికి పబ్లిక్ లో మంచి గుర్తింపు తెచ్చాయి. పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా ఉంటాడు అనుకున్న అతను ప్రస్తుతం మంగళగిరికే పరిమితం అయిపోయారు. అయితే ఇప్పుడు మాత్రం తన పూర్తి ఫోకస్ మంగళగిరి పై పెట్టిన లోకేష్ ప్రతి మండలం తిరుగుతున్నారు. ప్రజలకు వినూత్నమైన కార్యక్రమాల ద్వారా చేరువవడమే కాకుండా వారి కష్టసుఖాలను అడిగిమరీ తెలుసుకుంటున్నారు. అమరావతికి అత్యంత చేరువలో ఉన్న మంగళగిరి నుంచి పోటీ చేసి ఐదు వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు లోకేష్. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలి అన్న పట్టుదల అతనిలో కనిపిస్తోంది. వైసిపి తరఫున అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డిని కాదు అని మురుగుడు లావణ్య అనే మహిళకి జగన్ టికెట్ ఇచ్చారు. దీంతో మంగళగిరిలో గెలుపు ఎవరిది అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.













